భారతదేశం, అక్టోబర్ 29 -- దీపావళి పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటాము. దీపావళి నాడు లక్ష్మీదేవిని ఆరాధిస్తాము. ఆ రోజు లక్ష్మీదేవికి, కుబేరుడికి ప్రత్యేకంగా పూజలు చేసి, శుభ ఫలితాలను పొందాలని, అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటాము. అయితే, దీపావళికి ముందు వచ్చేది ధన త్రయోదశి కూడా చాలా విశేషమైనది.

చాలా చోట్ల దీపావళి పండుగను ఐదు రోజుల పాటు ఘనంగా జరుపుకుంటారు. ధన త్రయోదశి నాడు ధన్వంతరి స్వామిని, లక్ష్మీదేవిని, కుబేరుడిని పూజిస్తాము. ధన త్రయోదశి నాడు బంగారం, వెండి, ఇత్తడి, రాగి పాత్రలు కొనుగోలు చేసే సంప్రదాయం కూడా ఉంది. ధన త్రయోదశి నాడు కొన్ని కొత్త వస్తువులను ఇంటికి తీసుకురావడం వలన సుఖ సంతోషాలు, ఐశ్వర్యం కలుగుతాయని నమ్మకం. అలాగే, ఆ రోజు కొన్ని వస్తువులు కొనకూడదనే సంప్రదాయం కూడా ఉంది.

ధన త్రయోదశి నాడు ఏ వస్తువులను కొనుగోలు చేయాలి? వేటిని కొనుగోలు చేయక...