భారతదేశం, జూన్ 28 -- ఈ వారం ధనుస్సు రాశి వారికి మానసిక సంతోషం, సమాజంలో మంచి గుర్తింపుతో ప్రారంభమవుతుంది. మీ శ్రమను, ప్రయత్నాలను ఇతరులు గమనిస్తారు. ఇంటి లోపల, బయట మీ మాట తీరు అందరినీ ఆకట్టుకుంటుంది. బృహస్పతి అనుగ్రహం వల్ల మీలో ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. కుటుంబంలో చిన్నపాటి శుభకార్యాలు, బంధువుల కలయికలు మనసుకు ఎంతో ఆనందాన్ని ఇస్తాయి. වారం మధ్యలో మీలో ధైర్యం పెరిగినప్పటికీ, తొందరపాటు వల్ల కాస్త అలసట వచ్చే అవకాశం ఉంది. చిన్నపాటి ప్రయాణాలు లేదా హఠాత్తుగా కొన్ని పనులు పూర్తి కావడం జరుగుతుంది. వారం ద్వితీయార్థంలో ఫలితాలు పూర్తిగా మీ కష్టం మీదే ఆధారపడి ఉంటాయి. తోబుట్టువులు లేదా కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. వారాంతానికి మీ శ్రమకు తగ్గ ప్రతిఫలం కనిపిస్తుంది. నెమ్మదిగా సాగుతున్న పనులు కూడా సరైన దిశలో సాగుతాయి.

ప్రేమ, వైవాహిక జీవితంలో ఈ వారం...