భారతదేశం, నవంబర్ 10 -- ఆంధ్రప్రదేశ్ లో ఇవాళ, రేపు అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. వాతావరణంలో ఏర్పడిన మార్పుల నేపథ్యంలో. వానలు పడే సూచనలున్నాయి.

ప్రస్తుతం ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ నుంచి ఒడిశా, ఛత్తీస్‌గఢ్ మరియు జార్ఖండ్ మీదుగా ఈశాన్య ఉత్తరప్రదేశ్ వరకు సగటు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఒక ద్రోణి విస్తరించి ఉంది. ఇదిలా ఉంటే రేపు దక్షిణ అండమాన్ సముద్రంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడొచ్చని.. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఈనెల 13 నాటికి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో రాబోయే కొన్ని రోజుల పాటు వర్షాలు పడతాయని అధికారులు అంచనా వేస్తున్నారు.

కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాం పరిధిలో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేద...