భారతదేశం, సెప్టెంబర్ 29 -- దేశాభివృద్ధిలో వచ్చే 20 ఏళ్లు అత్యంత కీలకమని, ఈ కాలంలో ప్రభుత్వ వ్యవస్థలు, సంస్థల్లో విప్లవాత్మక మార్పులు రావాల్సిన అవసరం ఉందని ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. దేశ ప్రజల ఆకాంక్షలు వేగంగా మారుతున్నాయని, వాటికి అనుగుణంగా ప్రభుత్వ పాలనా విధానాలు, ప్రక్రియలు, ఉద్యోగుల నైపుణ్యాలు కూడా నిరంతరం మెరుగుపడాలని పేర్కొన్నారు. సాంకేతికతను వినియోగించుకోవడంతో పాటు పాత విధానాలు, అనవసర నిబంధనలను సరళీకరించి పాలనను ప్రజలకు మరింత చేరువ చేయాలని సూచించారు.

విజయవాడలోని అంబేద్కర్ కళావేదికలో కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మిషన్ కర్మయోగి ప్రాంతీయ సదస్సును ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఒడిశా, పుదుచ్చేరి రాష్ట్రాలకు చెందిన అధికారులు, శిక్షణ సంస్థల ప్రతిని...