భారతదేశం, డిసెంబర్ 22 -- బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఈ ఏడాది దేశభక్తి మంత్రం చాలా గట్టిగా పనిచేసింది. ఇలా అనడం దేశభక్తి ఎమోషన్‌ను అవమానించడమే అని హీరో, కత్రినా కైఫ్ భర్త విక్కీ కౌశల్ అభిప్రాయ పడ్డాడు. అయితే, 2025లో అత్యధిక వసూళ్లు రాబట్టిన మొదటి రెండు హిందీ చిత్రాలైన 'ఛావా' (Chhaava), 'ధురంధర్' (Dhurandhar) మధ్య చాలా పోలికలు ఉన్నాయి.

ఈ రెండు సినిమాలూ జాతీయవాదాన్ని ఇతివృత్తంగా తీసుకున్నవే. పాపులర్ స్టార్స్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ రెండు సినిమాల్లో మన వీరుల త్యాగాలను కళ్లకు కట్టేలా చూపించారు. ఈ రెండు సినిమాలు ప్రపంచవ్యాప్తంగా రూ. 800 కోట్లకు పైగా వసూళ్లు సాధించడంతో సినీ వర్గాల్లో ఒక ఆసక్తికర చర్చ మొదలైంది.

"దేశభక్తి అనేది బాక్సాఫీస్ వద్ద సేఫ్ గేమ్ ఆడేందుకు ఒక 'ఫార్ములా'గా మారిందా?" అన్నదే ఆ చర్చ సారాంశం. అయితే, 'ఛావా' హీరో విక్కీ కౌశల్ ఈ వ...