భారతదేశం, మార్చి 15 -- భారత ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించింది. పశ్చిమ బెంగాల్, అస్సాం, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్‌ను ఈసీ విడుదల చేసింది. ఎన్నికలకోడ్ తక్షణమే అమలులోకి వస్తుందని ఎన్నికల సంఘం వెల్లడించింది.

తమిళనాడులో234 అసెంబ్లీ స్థానాలు, పశ్చిమ బెంగాల్‌-294, కేరళ-140, అస్సాం-126, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి-30 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. మొత్తంగా 824 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనుంది ఈసీ.

Published by HT Digital Content Services with permission from HT Telugu....