భారతదేశం, జూన్ 18 -- నీట్ యూజీ 2025కు హాజరైన 22.09 లక్షల మంది విద్యార్థుల్లో 12.36 లక్షల మంది ఉత్తీర్ణత సాధించారు. కానీ తాజా ఎన్ఎంసీ డేటా ప్రకారం దేశంలోని 780 వైద్య కళాశాలల్లో (ప్రభుత్వ, ప్రైవేటు) 1,18,190 ఎంబీబీఎస్ సీట్లు మాత్రమే ఉన్నాయి. వీటిలో ఎయిమ్స్, JIPMER వంటి ప్రఖ్యాత సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలు ఉన్నాయి. అంటే దాదాపు 11.5 లక్షల మంది అర్హులైన విద్యార్థులకు ఎంబీబీఎస్ సీటు లభించదు.

కర్ణాటకలో అత్యధికంగా ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. అత్యధికంగా మెడికల్ కాలేజీలు ఉత్తరప్రదేశ్‌లో ఉంటాయి. నేషనల్ మెడికల్ కమిషన్(ఎన్ఎంసీ) ఇటీవల పంచుకున్న తాజా డేటాలో ఈ విషయం వెల్లడైంది. 2024-25 విద్యా సంవత్సరానికి మెడికల్ యూజీ, పీజీ మెడికల్ కోర్సుల(బ్రాడ్, సూపర్ స్పెషాలిటీ ప్రోగ్రామ్స్‌తో సహా) తాత్కాలిక సీట్ల సంఖ్యను ఎన్ఎంసీ విడుదల చేసింది.

దేశంలో వైద్య ...