భారతదేశం, మే 1 -- హైదరాబాద్: AI యుగంలోనూ సమస్త మానవాళికి ఉపయోగపడేలా ఓ అద్బుతమైన యాప్ అందుబాటులోకి వచ్చింది. ఇప్పటిదాకా వచ్చిన అనేక అప్లికేషన్లు కేవలం టెక్నాలజీ మీద ఆధారపడగా.. తొలిసారిగా AI తో పాటు, పురాతన శాస్త్రాల ఆధారంగా పనిచేసే సరికొత్త యాప్ విడుదలైంది. దేశంలోనే మొట్టమొదటి సారిగా.. ఒక్క అప్లికేషన్ తో, మనిషిని వేధిస్తున్న అనేక అవరోధాలను గుర్తించడమే కాదు, తక్షణ పరిష్కారాలు అందించడం ఆ యాప్ ప్రత్యేకత. ఈ యాప్ ను రూపొందించింది ఎవరో కాదు.. మన హైదరాబాదీలే.

హైదరాబాద్‌కు చెందిన ఆజా ఆస్ట్రోటెక్ కంపెనీ 5000 ఏళ్ల పురాతన బృహత్ పరాశర హోర శాస్త్రం ఆధారంగా "దోష నివారణ" యాప్‌ను ప్రారంభించింది. సమస్యలు మరియు దోషాలను గుర్తించి, బృహత్ పరాశర హోర శాస్త్రం సూత్రాల ప్రకారం సమర్థవంతమైన పరిష్కార మార్గాలను అందించే వేద ఆధారిత అప్లికేషన్ ఇది.

హైదరాబాద్‌లో జరిగిన ...