భారతదేశం, సెప్టెంబర్ 29 -- తెలుగు చిత్ర పరిశ్రమకు భారీ నష్టాన్ని కలిగించిన దేశంలోనే అతిపెద్ద సినిమా పైరసీ ముఠాను తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు పట్టుకున్నారు. ఈ ముఠాలోని ఆరుగురు సభ్యులను అరెస్టు చేసినట్లు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తాజాగా వెల్లడించారు.

ఈ ముఠా తెలుగుతో సహా పలు భాషల్లో సినిమాలను పైరసీ చేసిందని సీవీ ఆనంద్ చెప్పారు. ఈ ముఠా పైరసీ కారణంగా తెలుగు చిత్ర పరిశ్రమకు మొత్తం రూ.3,700 కోట్ల నష్టం వాటిల్లిందని తెలిపారు. ఈ కార్యకలాపాల వల్ల నిర్మాతలు తీవ్ర ఆర్థిక నష్టాన్ని ఎదుర్కొంటున్నారని సీవీ ఆనంద్ అన్నారు.

'టెలిగ్రామ్ ఛానెల్స్, టొరెంట్ సైట్లు, కొత్త ఎమ్ఓ సిస్టమ్ ద్వారా ఫిల్మ్ పైరసీ జరుగుతోంది. ముఠా సభ్యులు కెమెరాలను ఉపయోగించి థియేటర్లలో నేరుగా సినిమాలను రికార్డ్ చేస్తారు. డిజిటల్ శాటిలైట్ సిగ్నల్స్‌ను కూడా హ్యాక్ చేస్తారు. వ...