భారతదేశం, సెప్టెంబర్ 28 -- దశవిధాలైన పాపాలను హరించేది కనుకే 'దశహరా'ఇదే దసరాగా వాడుకలోకి వచ్చింది. దుష్టసంహారం ద్వారా ధర్మాన్ని నిలపడమే శరన్నవరాత్రి మహోత్సవాల్లో పరమార్థం. ఏటా ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి రోజు మొదలై ఆశ్వయుజ శుద్ధ దశమి వరకూ వైభవంగా ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఏడాది శరన్నవరాత్రి ఉత్సవాలు సెప్టెంబర్ 22 నుంచి అక్టోబరు2 వరకూ జరుగుతున్నాయి. ఈ సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై అమ్మవారు రోజుకో అలంకారంలో దర్శనమిస్తుంది. ఉత్సవాల్లో భాగంగా ఏడవ రోజు మహాచండిగా భక్తులను అనుగ్రహిస్తోంది దుర్గమ్మ.

చండీదేవిని దయగల రూపంలో ఉన్నప్పుడు ఉమా, గౌరీ, పార్వతి, హైమవతి, శతాక్షి, శాకంభరీ దేవి, జగన్మాత, భవాని అని పిలుస్తారు. అలాగే భయంకరమైన రూపంలో ఉన్నప్పుడు ఆమెను దుర్గ, కాళి , శ్యామ, చండీ, చండిక, భైరవి పేర్లతో పిలుస్తారు. ఈ అలంకారంలో ఉన్న అమ్మవారిని దర్శించుకుంటే ...