భారతదేశం, జూలై 29 -- చాలామంది నిత్యం పూజలు చేస్తూ ఉంటారు. వ్రతాలు వంటివి కూడా చేస్తూ ఉంటారు. అయితే దానాలు కూడా చాలా ముఖ్యమైనవి. మనం చేసే దానం వలన ఎంతో పుణ్యం లభిస్తుంది.

శాస్త్రం ప్రకారం చూస్తే, దానధర్మాలకు అత్యున్నత స్థానం ఉందని చెప్పొచ్చు. దయ, కృతజ్ఞత, ఆధ్యాత్మిక అంకితభావంతో దానం చేయడం వలన అనేక విధాలుగా ప్రయోజనాలను పొందవచ్చు. దానం మనసును శుద్ధి చేస్తుంది, పుణ్యఫలాలను అందిస్తుంది. చనిపోయిన తర్వాత ఆత్మకు మంచి మార్గాన్ని చూపుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి.

భక్తితో చేసిన దానానికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. దానిని భక్తితో దానం చేస్తే సుఖ శాంతులు కలుగుతాయి. శ్రేయస్సు, ఐశ్వర్యాన్ని పొందవచ్చు. అయితే దానం చేసినప్పుడు చాలామంది దేవాలయాలకు కూడా దానాలు చేస్తూ ఉంటారు. డబ్బుతో పాటు దేవాలయాలకు వీటిని దానం చేయడం వలన అద్భుతమైన లాభాలను పొందవచ్చు.

ధనం దాన...