భారతదేశం, మే 24 -- తెలంగాణ దేవాదాయ శాఖలో ఉద్యోగాల భర్తీ అంటూ ఇటీవల ప్రచారం జరిగింది. చాలా మంది అభ్యర్థులు ఈ పోస్టుల నోటిఫికేషన్ కోసం ఎదురుచూశారు. ఈ 190 ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్టుల ఖాళీలు ఉన్నాయని ఆన్‌లైన్‌లో ప్రచారంలో ఉన్న నకిలీ నియామక ప్రకటన పట్ల రాష్ట్ర దేవాదాయ శాఖ హెచ్చరించింది.

దేవాదాయ శాఖ అటువంటి నియామక ప్రకటనను ఏదీ విడుదల చేయలేదని అధికారులు స్పష్టం చేశారు. ఉద్యోగార్థులు ఆ తప్పుడు ప్రకటనను నమ్మవద్దని, దానికి స్పందించవద్దని సూచించారు. అన్ని నియామక ప్రకటనలు కేవలం అధికారిక ప్రభుత్వ, శాఖాపరమైన వెబ్‌సైట్‌ల ద్వారా మాత్రమే ఉంటాయి. ఈ నకిలీ ప్రకటనను సృష్టించి, వ్యాప్తి చేస్తున్న వ్యక్తులపై సైబర్ క్రైమ్ పోలీసుల ద్వారా కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు దేవాదాయ శాఖ పేర్కొంది.

రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాలు, దేవాదాయ శాఖ పరిధిలోని కార్యా...