భారతదేశం, నవంబర్ 21 -- అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం రేపుతున్న రూ.7 కోట్ల దేవాదాయ శాఖ ఉద్యోగాల కుంభకోణంపై సీబీఐతో విచారణ జరిపించాలని వైఎస్సార్‌సీపీ డిమాండ్ చేసింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సన్నిహితులు కోట రుక్మిణి, కేకే శ్రీనివాస్‌లను కూటమి ప్రభుత్వం రక్షిస్తోందని, ఈ వ్యవహారంలో ధరణి కృష్ణను బలిపశువును చేస్తోందని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి యనమల నాగార్జున యాదవ్ ఆరోపించారు. శనివారం (నవంబర్ 21) తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.

ఈ కుంభకోణంలో అసలు సూత్రధారులను తప్పించే ప్రయత్నం జరుగుతోందని నాగార్జున యాదవ్ విమర్శించారు. "నెలకు రూ.25 వేల నుంచి రూ.30 వేల వేతనం పొందే ఒక ఉద్యోగి ఒంటరిగా ప్రభుత్వ రాజముద్రలు, డిజిటల్ సంతకాలను ఫోర్జరీ చేయడం ఎలా సాధ్యం? 2025 నాటి తేదీలతో నియామక పత్రాలు, వేలిముద్రలతో కూడిన సర్వీ...