Andhrapradesh, సెప్టెంబర్ 25 -- ఉత్తర,ఆనుకుని ఉన్న మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది పశ్చిమ దిశగా కదులుతూ వాయువ్య, పశ్చిమమధ్య బంగాళాఖాతంలో రేపటికి వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది. ఎల్లుండి ఉదయానికి దక్షిణ ఒడిశా-ఉత్తరాంధ్ర తీరాలను దాటే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. సోమవారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్ళరాదని హెచ్చరికలను జారీ చేసింది.

తాజా వాతావరణ పరిస్థితుల ప్రభావంతో రేపు(సెప్టెంబర్ 26) రాష్ట్రంలో కొన్నిచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇక ఎల్లుండి ఉత్తరాంధ్ర, ఏలూరు, కృష్ణా,ఎన్టీఆర్,గుంటూరు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని పేర్కొంది. తీరం వెంబడి గంటకు 40-50 కిమీ వేగంతో ఈదురు గాలులు వీచే సూచనలున్నాయని వివరించింది.

రేపు(26-09-2025) ఏపీల...