భారతదేశం, జనవరి 19 -- మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్‌కు తెలుగులోనూ విపరీతమైన క్రేజ్ ఉంది. లక్కీ భాస్కర్, కాంత సినిమాలతో అలరించిన దుల్కర్ సల్మాన్ కంటెంట్ బేస్డ్ మూవీస్ ప్రేక్ష‌కుల‌పై ఎక్కువ ప్ర‌భావాన్ని చూపుతాయ‌ని ఆయ‌న గ‌ట్టిగా న‌మ్ముతుంటారు.

ఆ న‌మ్మ‌కంతో దుల్కర్ సల్మాన్ చేస్తోన్న మ‌రో డిఫ‌రెంట్ మూవీ 'ఆకాశంలో ఒక తార‌'. ఇదివరకు విడులైన ఆకాశంలో ఒక తార మూవీ ఫస్ట్ లుక్‌, టీజ‌ర్ అంద‌రినీ ఆక‌ట్టుకోవ‌టంతో పాటు సినిమాపై ఉన్న అంచ‌నాల‌ను మ‌రింత‌గా పెంచాయి.

యూనిక్ సినిమాటిక్ ఎప్రోచ్‌, ఇన్నోవేటివ్ స్టోరీ టెల్లింగ్‌తో సినిమాను రూపొందించే డైరెక్ట‌ర్ ప‌వ‌న్ సాధినేని ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. 'ఆకాశంలో ఒక తార' చిత్రాన్ని ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌లు గీతా ఆర్ట్స్, స్వ‌ప్న సినిమా స‌మ‌ర్ప‌ణ‌లో లైట్ బాక్స్ మీడియా బ్యాన‌ర్‌పై సందీప్ గున్నం, ర‌మ్య గున్...