భారతదేశం, అక్టోబర్ 13 -- మన హిందూ సంప్రదాయాల్లో శరన్నవరాత్రులకే ఉన్న విశిష్టత గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తొమ్మిది రోజులు కూడా భక్తి శ్రద్ధలతో దుర్గాదేవిని పూజిస్తాము. సాయంత్రం పూట దీపారాధన చేసి, అమ్మవారికి పూలను సమర్పించి, మంత్రాలు జపిస్తే అద్భుతమైన ఫలితాలను చూడొచ్చు. అయితే, నవరాత్రుల సమయంలో సాయంత్రం వేళ చేయాల్సిన కొన్ని పరిహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నవరాత్రుల్లో సాయంత్రం అమ్మవారి అనుగ్రహం కలగడానికి ఈ ఏడు పరిహారాలను ట్రై చేయండి. వీటి వలన ఇంట్లో అద్భుతమైన మార్పులను చూడొచ్చు.

సూర్యాస్తమయం అయ్యాక మీ పూజా మందిరాన్ని శుభ్రం చేసుకుని, అమ్మవారి ముందు నెయ్యి లేదా నూనెతో దీపాన్ని వెలిగిస్తే మంచిది.

దుర్గాదేవి పూజలో ఎర్రటి మందారాలు, ఎర్రటి గులాబీలు సమర్పించడం మంచిది. ఇవి శుభప్రదమైనవి. పూలు సమర్పిస్తే కుటుంబ సభ్యులకు ఆరోగ్యం, శ్ర...