భారతదేశం, జనవరి 1 -- తెలుగు సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి తనదైన శైలిలో వార్తల్లో నిలిచారు. 2025 బాక్సాఫీస్ విజేతగా నిలిచిన 'ధురంధర్' చిత్రంపై మొదటి నుంచి ప్రశంసలు కురిపిస్తున్న ఆర్జీవీ ఇప్పుడు సీక్వెల్ 'ధురంధర్ 2'కి సపోర్ట్ చేస్తూ ట్వీట్ వదిలారు.

అయితే, ఈ ట్వీట్‌లో 'రాకింగ్ స్టార్' యశ్ నటించిన 'టాక్సిక్' సినిమాపై పరోక్షంగా సెటైర్లు వేసినట్లుగా కనిపిస్తోంది. రామ్ గోపాల్ వర్మ తన సోషల్ మీడియా ఎక్స్ (గతంలో ట్విట్టర్) వేదికగా చేసిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట దుమారం రేపుతోంది.

"ధురంధర్ 2 కాటు 'టాక్సిక్'గా (విషపూరితంగా) ఉండబోతోంది" అంటూ రామ్ గోపాల్ వర్మ రాసుకొచ్చారు. అంటే, దురంధర్ 2 దెబ్బకు టాక్సిక్ తలవంచక తప్పదు అన్న అర్థంలో పరోక్షంగా యశ్ సినిమాపై సెటైర్లు వేశారు ఆర్జీవీ.

2026 మార్చి 19న ఈ రెండు భారీ చిత్రాలు దురంధర్ 2, టాక్సిక్ బాక్స...