భారతదేశం, డిసెంబర్ 20 -- ప్రపంచవ్యాప్తంగా జేమ్స్ కామెరాన్ సృష్టించిన 'అవతార్: ఫైర్ అండ్ యాష్' మ్యాజిక్ మొదలైంది. కానీ, భారత బాక్సాఫీస్ వద్ద మాత్రం ఒక ఆసక్తికరమైన పోరు కనిపిస్తోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ హాలీవుడ్ విజువల్ వండర్ ఇండియాలో దురంధర్ దాటికి నిలబడలేకపోయింది.

అవతార్ ఫైర్ అండ్ యాష్ సినిమా మొదటి రోజు ఇండియాలో రూ. 20.05 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టింది. సాధారణంగా ఇవి మంచి నంబర్లే అనిపించినా అప్పటికే థియేటర్లలో ఉన్న 'ధురంధర్' జోరు ముందు ఇవి తక్కువగానే కనిపిస్తున్నాయి.

నిజానికి అవతార్ 3 మొదటి రోజు భారత్‌లో రూ. 30 కోట్లకు పైగా వసూలు చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. కానీ, ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన 'ధురంధర్' బాక్సాఫీస్ వద్ద అజేయంగా దూసుకుపోతుండటంతో అవతార్ 3 అంచనాలు తలకిందులయ్యాయి.

విచిత్రం ఏంటంటే, విడుదలైన 15వ రోజు కూడా...