భారతదేశం, నవంబర్ 8 -- తెలుగు లోగిళ్లలో అత్యంత వైభవంగా, పవిత్రంగా జరుపుకునే పండుగ దీపావళి. ఈ ఏడాది నవంబర్ 8, 2026 ఆదివారం రోజున దీపావళి వేడుకలను నిర్వహించుకోనున్నాము. ప్రతి ఏటా ఆశ్వయుజ మాసంలో వచ్చే అమావాస్య తిథినాడు ఈ పర్వదినాన్ని జరుపుకుంటారు.

దీపావళి అంటే కేవలం ఇళ్లను దీపాలతో అలంకరించుకోవడం, పిండివంటలు తయారు చేసుకోవడం మాత్రమే కాదు; ఈ పవిత్ర దినాన దానధర్మాలు, సేవా కార్యకలాపాలకు కూడా అత్యంత ప్రాధాన్యత ఉంది.

హిందూ ధర్మ శాస్త్రాల ప్రకారం, దీపావళి రోజున విఘ్నేశ్వర సమేత మహాలక్ష్మిని భక్తిశ్రద్ధలతో కొలవడంతో పాటు నిరుపేదలకు, ఆకలితో ఉన్న వారికి శక్తికొద్దీ దానం చేయడం ఎంతో శ్రేయస్కరం. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ఇంట స్థిరంగా నివసిస్తుందని, కుటుంబంలో అష్టైశ్వర్యాలు వర్ధిల్లుతాయని పండితులు చెబుతున్నారు. ఈ ప్రత్యేక రోజున ఎలాంటి వస్తువులను దానం చేయడం...