భారతదేశం, నవంబర్ 4 -- తెలుగు లోగిళ్లలో పండుగ సంబరాలు మొదలయ్యాయి. వెలుగుల పండుగైన దీపావళికి ముస్తాబవుతున్నారు. ధన త్రయోదశి నుంచి ప్రారంభమయ్యే ఈ ఐదు రోజుల దీపావళి వేడుకల్లో ప్రధాన ఘట్టం లక్ష్మీ పూజ. ప్రతి ఏటా ఆశ్వయుజ మాసంలో వచ్చే అమావాస్య రోజున మహా లక్ష్మిని భక్తిశ్రద్ధలతో కొలుస్తారు.

ఈ పవిత్ర దినాన సంపదలకు అధిదేవత అయిన అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి భక్తులు ప్రత్యేక పూజలు, నోములు ఆచరిస్తారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఈ ప్రత్యేక రోజున ప్రతి ఒక్కరూ తమ రాశికి తగినట్లుగా కొన్ని పరిహారాలు చేయడం వల్ల జాతకంలోని గ్రహ దోషాలు తొలగిపోయి, సిరి సంపదలు వెల్లివిరుస్తాయని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

ఈ ఏడాది కార్తీక మాస అమావాస్య తిథి నవంబర్ 8న ఉదయం 11:27 నిమిషాలకు ప్రారంభమై, నవంబర్ 9న మధ్యాహ్నం 12:31 నిమిషాల వరకు కొనసాగుతుంది. దీపావళి పండుగలో సాయ...