భారతదేశం, నవంబర్ 8 -- దీపావళి పండుగ అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది వెలుగుల కాంతులు, లక్ష్మీదేవి పూజలు. ఆశ్వయుజ అమావాస్య నాటి రాత్రి లక్ష్మీదేవి, విఘ్నేశ్వరుల అనుగ్రహం కోసం ప్రతీ ఇంట్లోనూ ప్రమిదలు వెలిగించడం మన సనాతన సంప్రదాయం. అయితే, ఈ దివ్యమైన రాత్రి పూజలో వెలిగించిన దీపం ప్రమిద నుంచి కాటుకను తయారు చేసే ఆచారం శతాబ్దాలుగా వస్తోంది. ఈ విధంగా తయారు చేసిన కాటుకను కేవలం కంటికి అందం కోసం మాత్రమే కాకుండా, అనేక రకాల ఆధ్యాత్మిక నమ్మకాలతో ఇళ్లల్లో ఉపయోగిస్తారు.

దీపావళి రాత్రి పూజ పూర్తయిన తర్వాత ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో శ్రేష్ఠమైన దీపాన్ని వెలిగిస్తారు. ఆ దీపపు జ్వాల పైభాగంలో కాస్త ఎత్తులో వెండి లేదా రాగి పాత్రను ఉంచుతారు. దీపం జ్వాల నుంచి వచ్చే పొగ ఆ పాత్ర అడుగుభాగానికి తాకి నల్లటి బొగ్గు పొరగా మారుతుంది. పూజ ముగిసిన తరువాత ఆ నలుపును ఎంత...