Hyderabad, జూలై 29 -- రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ది రాజా సాబ్ మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో వస్తున్న ఈ హారర్ కామెడీ షూటింగ్ ఈ మధ్యే స్పీడందుకుంది. అయితే మంగళవారం (జులై 29) సడెన్ గా ఈ మూవీ సెట్లో ప్రభాస్ పాత స్నేహితులు పూరి జగన్నాథ్, ఛార్మీ ప్రత్యక్షమవడం విశేషం.

ది రాజా సాబ్ మూవీ షూటింగ్ ఇప్పుడు శరవేగంగా సాగుతోంది. ఈ ఏడాది డిసెంబర్ 5న రిలీజ్ కానున్నట్లు చెప్పడంతో మిగిలిపోయిన షూటింగ్ ను త్వరగా పూర్తి చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఆ మధ్య వచ్చిన టీజర్ అభిమానులను బాగా ఆకర్షించింది. మరోసారి ఆ పాత ప్రభాస్ ను చూపించడంతో ఫ్యాన్స్ ఖుష్ అయిపోయారు. ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

అయితే తాజాగా ది రాజా సాబ్ మూవీ షూటింగ్ లో ప్రభాస్ ను డైరెక్టర్ పూరి జగన్నాథ్, నటి, నిర్మాత ఛార్మీ కౌర్ కలిశారు. పూరిని చూడగాన...