భారతదేశం, ఆగస్టు 11 -- దిల్లీ ఎన్సీఆర్‌లోని అన్ని వీధి కుక్కలను నివాస ప్రాంతాల నుండి దూరంగా తరలించాలని సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ విధానాన్ని అడ్డుకునే ఏ సంస్థ అయినా కఠినమైన చర్యను ఎదుర్కోవలసి ఉంటుందని పేర్కొంది. కుక్క కాటు, రేబిస్ కారణంగా మరణాల కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు ముఖ్యమైన ఉత్తర్వులు ఇచ్చింది. వీధుల్లో వీధి కుక్కల బెడదతో పిల్లలు, వృద్ధులు గాయపడ్డారు, కొన్ని సందర్భాల్లో మరణించారు. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది.

ఎనిమిది వారాల్లోపు అన్ని వీధి కుక్కలను షెల్టర్లకు తరలించాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాన్ని అనుసరించి, దిల్లీ ప్రభుత్వం దానిని సకాలంలో అమలు చేస్తామని తెలిపింది. వీధికుక్కల దాడుల తర్వాత పెరుగుతున్న రేబిస్ మరణాల...