భారతదేశం, ఆగస్టు 15 -- రోడ్డుపై దొరికిన డబ్బును అలా వదిలేస్తారా? దాదాపు ఎవరూ అంత ఈజీగా వదిలేసి వెళ్లరు. రోడ్డుపై పది రూపాయల నోటు దొరికినా జనం ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసుకుంటారు. దాన్ని అందుకోవడానికి ముందు నలుదిక్కులా చూస్తారు. ఎవరైనా చూస్తున్నారేమోనని కూడా పరిశీలిస్తారు. ఆ తర్వాత తీసి జేబులో పెట్టుకుంటారు. జ్యోతిష్యం, హిందూ శాస్త్రాల ప్రకారం రోడ్డుపై డబ్బు దొరకడం కేవలం అదృష్టం కాదు. దాని వెనక కొన్ని విషయాలు ఉన్నాయి.

జ్యోతిష్య శాస్త్రంలో రోడ్డుపై డబ్బు దొరకడాన్ని శుభ, అశుభ సంకేతంగా భావిస్తారు. కొంతమంది పండితుల ప్రకారం ఇది లక్ష్మీదేవి అనుగ్రహం. మీ కర్మ ఫలితంగా అది మీకు లభించింది. మరికొందరి ప్రకారం అది ఎవరో కష్టపడి సంపాదించి పోగొట్టుకున్న డబ్బు. మీరు దానిని తీసుకుంటే.. దుఃఖం మీకు కూడా తోడవ్వవచ్చు. అమావాస్య రోజున శనివారం నాడు లేదా రాహువు స...