భారతదేశం, ఏప్రిల్ 22 -- హైదరాబాద్ ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో తమ సర్వీసులను పెంపుతున్నట్లు మెట్రో ప్రకటించింది. మియాపూర్-ఎల్బీనగర్ మార్గంలో 4 నిమిషాలకో మెట్రో ట్రైన్ నడుపుతున్నట్లు తెలిపింది. నాగోల్-రాయదుర్గం మార్గంలో 3 నిమిషాల 40 సెకన్లకో మెట్రో ట్రైన్ నడుపుతున్నట్లు మెట్రో అధికారులు ప్రకటించారు.

మియాపూర్ - ఎల్బీ నగర్ కారిడార్‌లో సాధారణంగా పీక్ అవర్స్‌లో 3 నిమిషాల 40 సెకన్లకు ఒక రైలు, నాన్-పీక్‌లో 4 నిమిషాల 50 సెకన్లకు ఒక రైలు. ఇప్పుడు రోజంతా 4 నిమిషాల 20 సెకన్లకు ఒక రైలుగా ఉంటుంది.

నాగోల్-రాయదుర్గ్ కారిడార్‌లో సాధారణంగా నాన్-పీక్‌లో 5 నిమిషాల 20 సెకన్లకు ఒక రైలు. ఇప్పుడు రోజంతా 3 నిమిషాల 40 సెకన్లకు ఒక రైలు ఉంటుంది.

సాధారణంగా వారపు రోజుల్లో ఉదయం 8 నుండి 10:30 వరకు, సాయంత్రం 5 నుండి 8 వరకు మాత్రమే 56 రైళ్లు నడిపేవారు. నాన్-పీక్ అవర్స్‌లో ...