భారతదేశం, అక్టోబర్ 16 -- దసరా పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని అధిగమించేందుకు దక్షిణ కోస్తా రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల సౌకర్యార్థం తిరుపతి - ఆవడి - రేణిగుంట మధ్య ప్రత్యేక జన్ సాధారణ్ మెము (MEMU) రైలును నడుపుతున్నట్లు వెల్లడించింది. ఈ ప్రత్యేక రైలు సర్వీస్ 2026 అక్టోబర్ 17 శనివారం నాడు ఒక్క రోజే నడపనున్నారు.

తిరుపతి నుంచి అవడి మార్గంలో ఈ ప్రత్యేక రైలు రేణిగుంట, పుత్తూరు, ఏకాంబరకుప్పం, తిరుత్తణి, అరక్కోణం, తిరువళ్లూరు స్టేషన్లలో ఆగుతుందని రైల్వే అధికారులు తెలిపారు. పండుగ వేళ ప్రయాణించే భక్తులు మరియు ప్రయాణికులు ఈ ప్రత్యేక రైలు సదుపాయాన్ని వినియోగించుకోవాలని సూచించారు.

Published by HT Digital Content Services with permission from HT Telugu....