భారతదేశం, అక్టోబర్ 13 -- అక్టోబర్ 11 నుంచి దసరా నవరాత్రులు ప్రారంభమయ్యాయి. అక్టోబర్ 19 వరకు నవరాత్రులు కొనసాగుతాయి. ఈ తొమ్మిది రోజుల్లో అమ్మవారి వివిధ రూపాలను పూజిస్తారు. ప్రతిరోజూ ఒక నిర్దిష్ట రంగు దుస్తులను ధరించే సంప్రదాయం కూడా ఉంది.

అమ్మవారి తొమ్మిది రూపాలకు, తొమ్మిది రంగులకు ప్రత్యేకత ఉంది. అయితే, నవరాత్రుల్లో తొమ్మిది రోజులు ఏ రోజు ఏ రంగును ధరించాలి? ఏ రోజు ఏ రంగును ధరిస్తే అద్భుతమైన ఫలితాలు కనిపిస్తాయి? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

అక్టోబర్ 11, ఆదివారం నారింజ రంగు.. అక్టోబర్ 12, సోమవారం నాడు తెలుపు రంగు ధరించాలన్న విషయం మనకు తెలిసిందే.

అక్టోబర్ 13, మంగళవారం: ఈరోజు ఎరుపు రంగు దుస్తులను ధరించడం వలన శుభ ఫలితాలు కనిపిస్తాయి. ఈ రంగు ప్రేమ, ఉత్సాహానికి చిహ్నం. ఈ రంగును ధరించడం వలన అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. ఈ రంగు దుర్గాదేవి తేజస్సు...