భారతదేశం, అక్టోబర్ 1 -- ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం జరిగింది. ఇందులో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దేశవ్యాప్తంగా 57 కొత్త కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలింది. అయిదే ఇందులో తెలంగాణకు 4 కేంద్రీయ విద్యాలయాలు రానున్నాయి. ఈ మేరకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలింది. మెుత్తం అన్నింటి నిర్మాణం కోసం కేంద్రం రూ.5,863 కోట్లు కేటాయించనుందని తెలుస్తోంది.

ఈ ప్రాంతాల్లో కేంద్రం కేంద్రీయ విద్యాలయాలు ఏర్పాటు చేయనుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం(యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్), ములుగు జిల్లా కేంద్రం(గిరిజన ప్రాంతం), జగిత్యాల జిల్లా- రూరల్ మండలం చెల్గల, వనపర్తి జిల్లా - నాగవరం శివారు ప్రాంతాల్లో కేంద్రీయ విద్యాలయాలు ఏర్పాటు కానున్నాయి. వీటిలో జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా, మూడు ఏళ్ల ప్రాథమిక ప్రీ-ప్రైమరీ తరగ...