భారతదేశం, అక్టోబర్ 12 -- హైదరాబాద్ నగరంలో ప్రజా రవాణా వ్యవస్థను మరింత మెరుగుపర్చేందుకు మెట్రో-ఆర్టీసీ సేవల కోసం కామన్ పాస్‌ను తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చింది. అయితే హైదరాబాద్ మెట్రో-టీజీఎస్ఆర్టీసీ సేవల కోసం ఉద్దేశించిన కామన్ మొబిలిటీ కార్డ్(Common Mobility Card) ధరలను పునఃపరిశీలించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రజల నుండి వచ్చిన అనేక ఫిర్యాదుల నేపథ్యంలో, క్షేత్రస్థాయి పరిస్థితులు, ప్రజల అభిప్రాయాలను పరిశీలిస్తున్నట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.

హైదరాబాద్ మెట్రో రైలు, తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) బస్సులలో ప్రయాణించడానికి వీలుగా ఈ కామన్ మొబిలిటీ కార్డ్ అక్టోబర్ 2, 2026న ప్రారంభించారు. దీని నెలవారీ పాస్ ధర రూ.8,500(ఇందులో హైదరాబాద్ మెట్రో వాటా రూ.7,000, ఆర్టీసీ వాటా రూ.1,500 ఉన్నాయి). అలాగే రోజువారీ పా...