భారతదేశం, అక్టోబర్ 7 -- దసరా పండుగ వేళ గ్రేటర్ హైదరాబాద్ నుంచి తమ సొంత ఊళ్లకు వెళ్లే ప్రయాణికులు, విద్యార్థులు, ఉద్యోగుల కోసం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(TGSRTC) భారీ ఏర్పాట్లు చేస్తోంది. పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రయాణికుల ఇబ్బందులను తొలగించేందుకు సంస్థ దాదాపు 7,000 పైగా ప్రత్యేక బస్సులను నడిపేందుకు ప్రణాళికలు సిద్ధం చేసిందని ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీధర్ వెల్లడించారు.

ఈసారి ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని టీజీఎస్‌ఆర్‌టీసీ సరికొత్త నిర్ణయం తీసుకుంది. కాలనీలు, గేటెడ్ కమ్యూనిటీలు, టౌన్‌షిప్‌లు లేదా విద్యార్థుల హాస్టళ్ల ప్రాంతాల్లో కనీసం 30 మంది ప్రయాణికులు సిద్ధంగా ఉంటే.. వారి ప్రాంతానికే నేరుగా ఆర్టీసీ ప్రత్యేక బస్సును పంపిస్తారు.

కూకట్‌పల్లి, జేఎన్టీయూ, మాదాపూర్, సుచిత్ర సర్కిల్, ఎల్బీనగర్, హయత్‌నగర్, బ...