భారతదేశం, నవంబర్ 6 -- నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ తెలుగు రొమాంటిక్ థ్రిల్లర్ సినిమా ది గర్ల్‌ఫ్రెండ్. ఈ మూవీలో హీరోగా టాలెంటెడ్ యాక్టర్ దీక్షిత్ శెట్టి చేశాడు. ఈ సినిమాను అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించాయి.

ది గర్ల్‌ఫ్రెండ్ సినిమాకు హీరో, డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ రచన, దర్శకత్వం వహించారు. ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మాతలుగా వ్యవహరించిన ది గర్ల్‌ఫ్రెండ్ నవంబర్ 7న తెలుగులో థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో నవంబర్ 5న హైదరాబాద్‌లో నిర్వహించిన ది గర్ల్‌ఫ్రెండ్ ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్‌లో నిర్మాత ధీరజ్ మొగిలినేని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ప్రొడ్యూసర్ ధీరజ్ మొగిలినేని మాట్లాడుతూ.. "సినిమానే ప్రపంచంగా జీవించే డైరెక్టర్ రాహుల్. ఆయ...