భారతదేశం, జూన్ 30 -- దేశీయ సరకు రవాణా రంగాన్ని బలోపేతం చేస్తూ.. మల్టీమోడల్ లాజిస్టిక్స్ (బహుళ రవాణా అనుసంధానత) వ్యవస్థ విస్తరణలో దక్షిణ మధ్య రైల్వే ఒక కీలక మైలురాయిని అధిగమించింది. పునర్వ్యవస్థీకరించిన దక్షిణ మధ్య రైల్వే పరిధిలోకి వచ్చే ఆంధ్రప్రదేశ్‌లోని వెల్దుర్తి గూడ్స్ షెడ్ నుంచి తొలిసారిగా ముడి ఇనుము (పిగ్ ఐరన్) లోడ్ చేసిన సరికొత్త కంటైనర్ రైలును రైల్వే అధికారులు విజయవంతంగా ప్రారంభించారు.

వెల్దుర్తి గూడ్స్ షెడ్ నుంచి బయలుదేరిన ఈ మొదటి కంటైనర్ రేక్ ద్వారా ఏకంగా 2,670 టన్నుల ముడి ఇనుమును పంజాబ్ రాష్ట్రంలోని ఫిల్లూర్ ఇన్‌ల్యాండ్ కంటైనర్ డిపోకు (ICD) రవాణా చేశారు. ఈ ఒకే ఒక్క సరకు రవాణా ద్వారా దక్షిణ మధ్య రైల్వేకు దాదాపు రూ.59 లక్షల అంచనా ఆదాయం సమకూరడం విశేషం.

దేశీయ కంటైనర్ రవాణాను భారీగా ప్రోత్సహించే లక్ష్యంతో వెల్దుర్తి గూడ్స్ షెడ్‌ను ...