భారతదేశం, డిసెంబర్ 17 -- ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ(స్విమ్స్)ను దక్షిణ భారతదేశంలోనే అత్యుత్తమ ఆసుపత్రిగా అభివృద్ధి చేస్తున్నామని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు వెల్లడించారు. బుధవారం సెంట్రల్ మెడికల్ గోడౌన్, రోగుల సహాయకుల కోసం అదనపు అంతస్తులను ప్రారంభించారు.

ఈ సందర్భంగా టీటీడీ ఛైర్మన్ మాట్లాడారు. రూ.10.65 కోట్లతో 37 వేల చదరపు అడుగులు విస్తీర్ణంలో మూడు అంతస్తుల్లో సెంట్రల్ మెడికల్ గోడౌన్ ప్రారంభించామన్నారు. ఇందులో మెడికల్ స్టోర్లు, జనరల్ స్టోర్లు, కోల్డ్ స్టోరేజ్, ఆపరేషన్ థియేటర్ స్టోర్లు, కార్యాలయాలు, సమావేశ మందిరం ఉన్నాయని తెలిపారు. అదేవిధంగా రూ.4 కోట్ల 40 లక్షల వ్యయంతో 300 మంది రోగుల సహాయకులు వేచి ఉండేందుకు వీలుగా విశ్రాంతి భవనంలో అదనపు అంతస్తులను ప్రారంభించినట్టు తెలిపారు.

ఇందులో రోగుల సహ...