భారతదేశం, సెప్టెంబర్ 29 -- విదేశాల్లో సెటిల్ అయిన తెలంగాణకు చెందినవారు అక్కడ కూడా బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. తెలంగాణలో జరుపుకొన్నట్టుగానే బతుకమ్మ పండుగ వేడుకను జరుపుకొన్నారు. దక్షిణాఫ్రికాలోని తెలంగాణ ప్రవాస భారతీయులు బతుకమ్మ వేడుకలను అధిక సంఖ్యలో హాజరై జరిపారు. జోహానెస్‌బర్గ్ నగరంలోని శాన్‌డౌన్ హైస్కూలో వేడుకలు నిర్వహించారు. ఇందులో తెలంగాణకు చెందినవారే కాదు.. వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రవాస భారతీయులు కూడా పాల్గొని ఆడిపాడారు. అంతేకాదు స్థానికులు కూడా పాల్గొనడం విశేషం.

తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా(టీఏఎస్‌ఏ) ఈ వేడుకలను నిర్వహించింది. తెలంగాణ ఆడపడుచులు.. తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చారు. ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ.. ఏమేమి కాయప్పునే గౌరమ్మ అంటూ అధిక సంఖ్యలో పాల్గొని ఆడిపాడారు. అచ్చం తెలంగాణలో నిర్వహించినట్టుగానే వేడుకలు చేశారు...