Tamilnadu, అక్టోబర్ 1 -- తమిళనాడు రాష్ట్రంలోని చెన్నైలో విషాదం చోటు చేసుకుంది. ఎన్నోర్‌ థర్మల్‌ పవర్ స్టేషన్ లో నిర్మాణంలో ఉన్న ఓ భవనం కూలి తొమ్మిది మంది వలస కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన మంగళవారం చోటు చేసుకుంది. పదుల సంఖ్యలో మరికొంత మంది కార్మికులు గాయపడ్డారు. వీరిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఈ ఘటనపై తమిళనాడు సీఎం స్టాలిన్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలను తక్షణమే పర్యవేక్షించాలని విద్యుత్ శాఖ మంత్రి ఎస్ఎస్ శివశంకర్ తో పాటు అధికారులను ఆదేశించారు.

ఈ ఘటనపై తమిళనాడు ప్రభుత్వంలోని మంత్రిగా ఉన్న గణేశన్ మీడియాతో మాట్లాడారు. థర్మల్ పవర్ నిర్మాణ స్థలంలోని స్టీల్ ఆర్చ్ కూలిపోవడంతో ఈ ఘటన జరిగిందని చెప్పారు. తొమ్మిది మంది కార్మికులు మృతి చెందారని వెల్లడించారు. ఇతర రాష్ట్రాల కూలీలు మరణించారని తెలిపార...