భారతదేశం, సెప్టెంబర్ 21 -- హీరో మోటోకార్ప్ మరోసారి కోకా-కోలా కంపెనీతో జతకట్టి 'థండర్‌వీల్స్ 2.0' కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ భాగస్వామ్యంలో భాగంగా, థమ్స్ ​అప్ ప్యాక్‌లపై ఉన్న క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి, కస్టమర్లు కొత్త హీరో ఎక్స్‌ట్రీమ్ 250ఆర్​ బైక్‌లను గెలుచుకునే అవకాశం పొందవచ్చు. గత సంవత్సరం మావ్రిక్ 440 థండర్‌వీల్స్ ఎడిషన్ విజయవంతం అయిన తర్వాత ఇప్పుడు ఈ కొత్త బైక్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చారు.

గతంలో వచ్చిన హీరో మావ్రిక్ 440లో కనిపించిన ఎరుపు, నీలం థమ్స్ అప్ లోగోలకు భిన్నంగా.. కొత్త హీరో ఎక్స్‌ట్రీమ్ 250ఆర్​ పూర్తిగా నలుపు రంగులో, ఎరుపు రంగు డిజైన్‌తో ఆకట్టుకుంటుంది. ఈ బైక్‌పై ఎక్కడా బ్రాండింగ్ లోగోలు లేవు. విజేతలకు ఇచ్చే ఫైనల్ బైక్‌పై బ్రాండ్ లోగోలు ఉంటాయా, లేదా అనే దానిపై ఇంకా స్పష్టత లేదు.

హీరో ఎక్స్​ట్రీమ్​ 250ఆర్​ థండర్​వీల...