భారతదేశం, సెప్టెంబర్ 21 -- మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రకాశం జిల్లాలో పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా అద్దంకిలో 120 మంది లబ్ధిదారులకు సుమారు రూ.70లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. త్వరలో తెచ్చే సంజీవని పథకంతో ప్రతీ కుటుంబానికి రూ.25 లక్షల వరకు లబ్ధి చేకూరుతుందన్నారు. ప్రభుత్వ, ప్రజల, ప్రైవేటు భాగస్వామ్యంతో మెడికల్ కాలేజీలు త్వరగా పూర్తయ్యేలా చర్యలు చేపట్టారన్నారు.

ప్రకాశం జిల్లా టంగుటూరు మండలంలోని తూర్పునాయుడుపాలెం గ్రామంలో మంత్రులు డోలా బాల వీరాంజనేయ స్వామి, వంగలపూడి అనితతో మంత్రి గొట్టాపాటి పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రులు పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడంతో పాటు, శంకుస్థాపనలు చేశారు. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజల మీద ఎలాంటి భారం పడకుండా నాణ్యమైన విద్యుత్ ను అందించేందుక...