భారతదేశం, జనవరి 4 -- తెలుగు రాష్ట్రాల్లో పలు రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఈ ఘటనల్లో పలువురు మృతి చెందారు. యాదాద్రి-భువనగిరి జిల్లా వలిగొండ మండలం నర్సాపురం వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. ఇద్దరు యువకులు ప్రయాణిస్తున్న మోటార్ సైకిల్‌ను కంటైనర్ లారీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందారు.
మృతులను యాదాద్రి-భువనగిరి జిల్లా మోత్కూరు మండలం దత్తప్పగూడెం గ్రామానికి చెందిన బొల్లా దీక్షిత్ (21), కొక్కల సాయి (20)గా గుర్తించారు. ఉదయం 7 గంటల ప్రాంతంలో మోత్కూరు నుండి వలిగొండ వైపు యువకులు వెళ్తుండగా ఎదురుగా వస్తున్న కంటైనర్ లారీ మోటార్ సైకిల్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరూ లారీ టైర్ల కింద పడి అక్కడికక్కడే మరణించారు. లారీ డ్రైవర్ అతివేగం, నిర్లక్ష్యంగా నడపడమే ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.