భారతదేశం, ఆగస్టు 20 -- తెలుగు రాష్ట్రాలకు వాతావరణ కేంద్రం కీలక అప్డేట్ ఇచ్చింది. పలు ప్రాంతాలకు వర్ష సూచన ఉందని అంచనా వేసింది. కొన్ని జిల్లాలకు మాత్రం ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ బులెటిన్ ప్రకారం.. ఏపీలో పలు ప్రాంతాల్లోని వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా ఇవాళ పోలవరం, డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగతా జిల్లాల్లో సాధారణ వాతావరణం నెలకొంటుంది. అక్కడక్కడ చెదురుమదురుగా తేలికపాటి జల్లులు మాత్రమే పడతాయని APSDMA స్పష్టం చేసింది.

తెలంగాణ వ్యాప్తంగా 4 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. కొన్ని జిల్లాల్లో గంటకు 30-40 ...