భారతదేశం, మార్చి 13 -- పెరుగుతున్న జనాభా, ఆయా మార్గాలలో.. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా రైల్వేశాఖ.. నూతన రైలు సర్వీసులను ప్రారంభిస్తూ ఉంటుంది. అందులో భాగంగా 2014 నుంచి ఇప్పటివరకు గత 12 సంవత్సరాల కాలంలో హైదరాబాద్ కేంద్రంగా రైల్వేశాఖ 91 కొత్త రైలు సర్వీసులను ప్రారంభించింది. ఈ రైళ్లన్నీ కూడా జంట నగరాల పరిధిలోని రైల్వేస్టేషన్ల నుంచే (హైదరాబాద్, సికింద్రాబాద్, కాచిగూడ, చర్లపల్లి టర్మినల్) ప్రారంభమవుతున్నాయి.

కొత్త సర్వీసుల ప్రారంభంతో పాటుగా.. ఇప్పటికే నడుస్తున్న రైలు సర్వీసుల్లో.. పాత కోచ్ లను ఆధునీకరించి ప్రయాణికులకు మరిన్ని సౌకర్యాలను అందుబాటులోకి తీసుకురావడానికి కూడా భారతీయ రైల్వే నిరంతరం కృషి చేస్తోంది. ప్రస్తుతం కొన్ని మార్గాలలో ప్రయాణికుల నుంచి వచ్చిన డిమాండ్ కు అనుగుణంగా సేవలు అందిస్తున్న మూడు స్పెషల్ ట్రైన్స్‌ను.. రెగ్యులర్ ట్రైన్స్‌గా...