భారతదేశం, ఆగస్టు 5 -- Arunachalam Moksha Yatra Tour Package : ఆధ్యాత్మిక యాత్రలు చేయాలనుకునే తెలుగు రాష్ట్రాల భక్తులకు ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) తీపి కబురు అందించింది. ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రాలైన అరుణాచలం (తిరువణ్ణామలై), కాంచీపురంలతో పాటు అందమైన పుదుచ్చేరిని సందర్శించేందుకు 'అరుణాచల మోక్ష యాత్ర' పేరుతో ఒక ప్రత్యేక టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చింది.

హైదరాబాద్‌లోని కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి ప్రతి శుక్రవారం సాయంత్రం బయలుదేరే ఈ యాత్ర 4 రాత్రులు, 5 రోజుల పాటు సాగుతుంది. స్లీపర్, 3ఏసీ తరగతుల్లో ప్రయాణించే వెసులుబాటును ఐఆర్‌సీటీసీ కల్పించింది. ప్రస్తుతం ఈ ప్యాకేజీ ఆగస్ట్ 14వ తేదీన అందుబాటులో ఉంది. ఈ తేదీ మిస్ అయితే. మరో తేదీలో కూడా ప్లాన్ చేసుకోవచ్చు. అయితే ముందుగానే టికెట్లు బుకింగ్ చేసుకోవాలి.

జూన్ 1, ...