భారతదేశం, ఆగస్టు 8 -- SCR Tirupati Karimnagar Express : తిరుపతి నుంచి కరీంనగర్ వైపు ప్రయాణించే రైలు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే ముఖ్యమైన అప్డేట్ ఇచ్చింది. రైళ్ల నిర్వహణ సజావుగా సాగించేందుకు, ప్రయాణికులకు మరింత సౌకర్యవంతంగా ఉండేలా టైమింగ్స్ షెడ్యూల్(తిరుపతి - కరీంనగర్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ నెంబర్ - 12761) లో పలు మార్పులు చేసింది. ఈ సవరించిన రైలు వేళలు 2026 అక్టోబర్ 10వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి.

ప్రస్తుతం ఉన్న షెడ్యూల్ ప్రకారం తిరుపతి స్టేషన్ నుంచి రాత్రి 08:05 గంటలకు బయల్దేరే ఈ రైలు.. ఇకపై 15 నిమిషాల ముందే అంటే రాత్రి 07:50 గంటలకే ప్లాట్‌ఫాం వదిలి బయల్దేరుతుంది.

దీంతో పాటు దారిలోని ప్రధాన స్టేషన్లు, నిష్క్రమణ సమయాల్లో కూడా రైల్వే శాఖ తగిన మార్పులు చేసింది. రేణిగుంట స్టేషన్‌కు ప్రస్తుతం రాత్రి 08:28 గంటలకు వచ్చి 08:30కి బయల్దేరుతు...