తెలుగు ప్రయాణికులకు అలర్ట్ - ఈ రూట్లలో ప్రత్యేక రైళ్లు, మరికొన్ని పొడిగింపు..!
భారతదేశం, నవంబర్ 14 -- రైలు ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల అదనపు డిమాండ్‌కు అనుగుణంగా హెచ్.ఎస్. నాందేడ్ - చర్లపల్లి, బరౌని - ఎస్‌ఎంవీటీ బెంగళూరు మధ్య వన్-వే ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది.
దీనితో పాటు చర్లపల్లి - దానాపూర్ మధ్య నడిచే ప్రత్యేక రైలు సర్వీసులను పొడిగిస్తూ దక్షిణ మధ్య రైల్వే నిర్ణయం తీసుకుంది. ప్రయాణికులు ఈ రైళ్ల తేదీలు, హాల్టింగ్ స్టేషన్లు, బోగీల వివరాలను గమనించి తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని అధికారులు కోరారు.
ఈ వన్-వే ప్రత్యేక రైలు 2026 నవంబర్ 20న (శుక్రవారం) ఒక్క ట్రిప్పు నడుస్తుంది.
రద్దీ దృష్ట్యా చర్లపల్లి - దానాపూర్ మధ్య నడిచే ప్రత్యేక రైళ్లను మరో ట్రిప్పు పొడిగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది.
Published by HT Digital Content Servic...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.