భారతదేశం, సెప్టెంబర్ 25 -- హైదరాబాద్‌లో కొన్ని ప్రాంతాల్లో అడ్రస్ చెప్పేందుకు ఉపయోగించే ముఖ్యమైన వాటిలో తెలుగు తల్లి ఫ్లైఓవర్ ఒకటి. తెలుగు తల్లి ఫ్లైఓవర్ కింద నుంచి వెళ్లాలి, పైనుంచి వెళ్లాలి అని చెబుతుంటారు. అయితే ఇకపై ఇది తెలంగాణ తల్లి ఫ్లైఓవర్. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్‌ఎంసీ) 'తెలుగు తల్లి ఫ్లైఓవర్' పేరును అధికారికంగా 'తెలంగాణ తల్లి ఫ్లైఓవర్'గా మార్చింది. ఈ ప్రతిపాదనను జీహెచ్‌ఎంసీ స్టాండింగ్ కమిటీ ముందు ఉంచి ఆమోదించారు.

'తెలుగు తల్లి ఫ్లైఓవర్ పేరును తెలంగాణ తల్లి ఫ్లైఓవర్‌గా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకున్నాం. త్వరలో కొత్త సైన్‌బోర్డులు కూడా ఏర్పాటు అవుతాయి.' అని జీహెచ్‌ఎంసీ అధికారి ఒకరు తెలిపారు.

సమావేశంలో ఈ ప్రతిపాదనను టేబుల్ ఎజెండాగా ప్రవేశపెట్టారు. మేయర్ విజయలక్ష్మి నేతృత్వంలోని 15 మం...