భారతదేశం, జనవరి 2 -- స్టార్ మా, జీ తెలుగు ఛానెల్స్ కు సంబంధించి తెలుగు టీవీ సీరియల్స్ టీఆర్పీ రేటింగ్స్ వచ్చేశాయి. మరోసారి కార్తీక దీపం 2 సీరియల్ టాప్ లోనే ఉండగా.. టాప్ 10లో మొత్తంగా ఏడు స్టార్ మా సీరియల్సే ఉన్నాయి. జీ తెలుగు సీరియల్స్ చివరి మూడు స్థానాలతో సరిపెట్టుకున్నాయి.

కొన్నేళ్లుగా తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్న స్టార్ మా సీరియల్స్.. 2025లోనూ అదే హవా కొనసాగించాయి. 51వ వారం కూడా టాప్ 7లో అన్నీ ఆ ఛానెల్ సీరియల్సే ఉన్నాయి. తొలి స్థానంలో ఉన్న కార్తీక దీపం 2 సీరియల్ కు 14.25 రేటింగ్ వచ్చింది. ఓవరాల్ గా ఈ సీరియల్ తొలి స్థానంలో ఉన్నా.. కేవలం అర్బన్ రేటింగ్ చూసుకుంటే మాత్రం 11.16తో గుండె నిండా గుడి గంటలు తొలి స్థానంలో ఉంది. ఓవరాల్ గా 12.37తో ఇది మూడో స్థానంలో ఉంది.

రెండో స్థానంలో ఉన్న ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ కు 13.62 రేటింగ్ నమోదైంద...