భారతదేశం, మే 21 -- తెలుగు ఎంటర్టైన్మెంట్ టీవీ ఛానెల్స్ రేటింగ్స్ యుద్ధం ఎప్పుడూ రసవత్తరంగానే ఉంటుంది. ముఖ్యంగా సీరియల్స్ విషయంలో స్టార్ మా, జీ తెలుగు టాప్ 10లో ఆధిపత్యం కోసం పోటీ పడుతుంటాయి. తాజాగా 19వ వారానికి సంబంధించిన అర్బన్, రూరల్ (U+R) తో పాటు కేవలం అర్బన్ (U) మార్కెట్ టీఆర్‌పీ రేటింగ్స్ వచ్చేశాయి. ఈ వారం కూడా రెండు ప్రధాన వినోద చానళ్లు స్టార్ మా, జీ తెలుగు మధ్య గట్టి పోటీ నడిచింది.

బుల్లితెరపై దూసుకుపోతున్న టాప్ 10 సీరియల్స్ ఏవో ఇక్కడ చూడండి. అర్బన్, రూరల్ (U+R) రేటింగ్స్ ఆధారంగా ప్రేక్షకులను టీవీలకు కట్టిపడేసిన ఆ టాప్ సీరియల్స్ ఇవే.

గత సీజన్ సృష్టించిన సంచలనాన్ని కార్తీక దీపం 2 కొనసాగిస్తోంది. ఈ వారం కూడా 11.08 అర్బన్, రూరల్ రేటింగ్ తోపాటు 9.08 అర్బన్ రేటింగ్‌తో నంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకుంది. తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ఈ...