భారతదేశం, సెప్టెంబర్ 24 -- ఉపరాష్ట్రపతి అయ్యాక తొలిసారిగా సీపీ రాధాకృష్ణన్ ఆంధ్రప్రదేశ్ పర్యనకు వచ్చారు. పున్నమి ఘాట్‌లో జరుగుతున్న విజయవాడ ఉత్సవ్‌లో పాల్గొన్నారు. ఉపరాష్ట్రపతి అయ్యాక మెుదటిసారి విజయవాడకు రావడం సంతోషంగా ఉందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ దేశానికి అన్నపూర్ణలాంటిదని ఉపరాష్ట్రపతి అన్నారు. అన్ని రంగాల్లో ఏపీ దూసుకెళ్తోందన్నారు. విజయవాడ హాట్ సిటీ అని.. కానీ ఇక్కడ కూల్ పిపుల్ ఉంటారని ప్రశంసించారు.

విజయవాడ అభివృద్ధి చెందిన గొప్ప నగరంగా మారాలని కోరుకుంటున్నట్టుగా ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ తెలిపారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం వికసిత్ ఆంధ్రప్రదేశ్‌ దిశగా వెళ్తోందని కొనియాడారు. ఈ పర్యటనను తన జీవితంలో మరిచిపోలేనని వ్యాఖ్యానించారు. 'తెలుగువారి సంస్కృతి, సంప్రదాయాలు చాలా గొప్పవి. ప్రజలందరికీ దుర్గమ్మ ఆశీస్సులు ఉండాలి. జై ఆంధ్రప్...