భారతదేశం, డిసెంబర్ 11 -- ప్రేక్ష‌కుల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు వైవిధ్య‌మైన కంటెంట్‌తో మెప్పిస్తోన్న ఇండియాలో అతిపెద్ద‌దైన ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ జీ 5 మ‌రోసారి త‌న‌దైన శైలిలో విల‌క్ష‌ణ‌మైన తెలుగు ఒరిజిన‌ల్ సిరీస్‌తో ఆడియెన్స్‌ను అల‌రించ‌నుంది. అదే 'న‌య‌నం'. హీరో వ‌రుణ్ సందేశ్‌, బిగ్ బాస్ బ్యూటీ ప్రియాంక జైన్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో నటించారు.

నయనం ఓటీటీ సిరీస్‌లో అలీ రెజా, ఉత్తేజ్, రేఖా నిరోషా త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో నటించారు. సీట్ ఎడ్జ్ సైకో, క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన నయనం సిరీస్‌ను స్వాతి ప్ర‌కాశ్ డైరెక్ట్ చేశారు. ఓటీటీ స్ట్రీమింగ్ నేపథ్యంలో ఇటీవల నయనం ట్రైలర్ రిలీజ్ లాంచ్ నిర్వహించారు.

ఈ కార్య‌క్ర‌మంలో డైరెక్ట‌ర్ స్వాతి ప్ర‌కాష్‌, మ్యూజిక్ డైరెక్ట‌ర్ అజ‌య్ అర‌సాడ‌, ఎడిట‌ర్ వెంక‌ట కృష్ణ‌, సినిమాటోగ్రాఫ‌ర్ షోయ‌బ్ సిద్ధికీ, అలీ రెజా, డైరెక్ట‌ర్ ర...