భారతదేశం, జూలై 15 -- హైదరాబాద్‌ శామీర్‌పేట జీనోమ్‌వ్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. ఐకోర్ బయోలాజిక్స్ పరిశ్రమ ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడారు. జీనోమ్‌వ్యాలీలోని పరిశ్రమలు తెలంగాణకు గుర్తింపు తెచ్చాయని సీఎం కొనియాడారు. దేశంలోని వ్యాక్సిన్ల ఉత్పత్తిలో 33 శాతం కేవలం జీనోమ్‌వ్యాలీ నుంచి ఉత్పత్తి చేస్తున్నట్టుగా చెప్పారు.

ప్రపంచమంతా కోవిడ్ భయం ఉన్న సమయంలో జీనోమ్‌వ్యాలీ నుంచి వ్యాక్సిన్ల ఉత్పత్తి జరిగినట్టుగా చెప్పారు. ప్రపంచ దేశాలకు సరఫరా చేసినట్టుగా వెల్లడించారు.

'రాష్ట్రంలో ఉత్తమ పారిశ్రామిక విధానం అమలు చేస్తాం. 18 నెలల్లోనే 3 లక్షల కోట్లకుపైగా పెట్టుబడులు తెచ్చాం. రాష్ట్రాలతో కాదు.. ప్రపంచ దేశాలతో పోటీ పడాలన్నది మా ప్రయత్నం. ప్రపంచ బల్క్స్ రాజధానిగా హైదరాబాద్ రూపుదిద్దుకుంటోంది. రాబోయే పదేళ్లలో తెలంగాణన...