భారతదేశం, జూన్ 7 -- తెలంగాణ పాఠశాల విద్యాశాఖ 2026-27 విద్యాసంవత్సరానికి సంబంధించిన వార్షిక అకడమిక్ క్యాలెండర్‌ను అధికారికంగా విడుదల చేసింది. 1వ తరగతి నుంచి 10వ తరగతి చదివే విద్యార్థుల కోసం రూపొందించిన ఈ క్యాలెండర్‌లో తరగతుల నిర్వహణ, పరీక్షల తేదీలు, సెలవులు, పాఠ్యేతర ప్రణాళికలను విద్యాశాఖ స్పష్టంగా పొందుపరిచింది.

ఈ విద్యాసంవత్సరంలో పాఠశాలలు మొత్తం 227 పనిదినాలపాటు నడవనున్నాయి. ఈ విద్యాసంవత్సరం చివరి పనిదినం 2027 ఏప్రిల్ 23గా నిర్ణయించారు. ఆ తర్వాతి రోజు, అనగా 2027 ఏప్రిల్ 24 నుంచి జూన్ 13 వరకు విద్యార్థులకు వేసవి సెలవులు ఉంటాయి.

విద్యార్థుల ప్రగతిని అంచనా వేసేందుకు విద్యాశాఖ ఫార్మేటివ్ (FA), సమ్మేటివ్ (SA) పరీక్షల షెడ్యూల్‌ను కింది విధంగా ప్రకటించింది.

ఈ విద్యాసంవత్సరంలో విద్యార్థులకు మూడు ప్రధాన పండుగ సెలవుల కాలాన్ని విద్యాశాఖ కేటాయించ...